ఇల్లంతకుంట (ఏక్ దం న్యూస్ ) కేజీబివి అతిథి అధ్యాపకుల నియామకం దరఖాస్తులకు జూన్ 13 సాయంత్రం 5 గంటల వరకు గడువు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కె. శిరీష ప్రకటన

ఇల్లంతకుంట, జూన్ 11:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థినులకు బోధించడానికి తాత్కాలిక ప్రాతిపదికన "అతిథి అధ్యాపకుల" (Guest Faculty - PGCRT) నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కె. శిరీష ఒక ప్రకటనలో తెలిపారు.తెలుగు
ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జూవాలజీ లలో ఖాళీలు ఉన్నట్టు తెలిపారు.
కావలసిన అర్హతలు:
సంబంధిత సబ్జెక్టులో పీజీ (PG) మరియు బీఈడీ (B.Ed) లో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.
బోధనా అనుభవం (Experience) ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారములతో పాటు విద్యార్హతలకు సంబంధించిన అన్ని జిరాక్స్ (నకలు) సర్టిఫికెట్లను జూన్ 11 నుండి జూన్ 13 సాయంత్రం 5:00 గంటల లోపు ఇల్లంతకుంట కేజీబీవీ పాఠశాలలో స్వయంగా అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు పాఠశాల కార్యాలయంలో సంప్రదించవచ్చని స్పెషల్ ఆఫీసర్ శిరీష పేర్కొన్నారు.