ఇల్లంతకుంట (ఏక్ దం న్యూస్ ):జూన్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోమహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించి, ఆమెపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.

ఇల్లంతకుంట (ఏక్ దం న్యూస్ ):జూన్ 10
మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. మండలంలోని రేపాక గ్రామానికి చెందిన జోగు సందీప్ (30), అతని తల్లిదండ్రులు ఈ నెల 7న అదే గ్రామానికి చెందిన రణం రేణుకపై దాడికి దిగారు. బాధితురాలిని బూతులు తిడుతూ, ఇటుక రాయితో కొట్టి, ఆమె దుస్తులు చింపివేసి అగౌరవంగా ప్రవర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం సందీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.