ఏక్ దం న్యూస్/సిరిసిల్ల ప్రతినిధి జూన్ 07:
ఎస్బీఐ ఏటీఎంలలో 'నో క్యాష్' బోర్డులు: ఖాతాదారుల తీవ్ర ఇబ్బందులు
ఏక్ దం న్యూస్/సిరిసిల్ల ప్రతినిధి జూన్ 07:
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) ఖాతాదారులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఎస్బీఐ ఏటీఎంలలో నగదు కొరత తీవ్రంగా వేధిస్తోంది. సాంకేతిక సమస్యలు, సకాలంలో నగదు లోడ్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ఏటీఎంలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
పలు ప్రాంతాల్లో నిలిచిన సేవల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కీలక ప్రాంతాలైన రామ్ నగర్, చింతకుంట గాంధీ నగర్ లతో పాటు.. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వెంకట్రావుపల్లి, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలు గత కొన్ని రోజులుగా నగదు లేక వెలవెలబోతుండటం తో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.